మమ్మల్ని ఎవరూ అడగలేదు: అనుష్క

6 Aug, 2020 08:50 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మ, భర్త విరాట్‌ కోహ్లితో కలిసి ఇటీవల అసోం, బిహార్​ రాష్ట్రాల్లో వరదల వ‌ల్ల‌ నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇంటరాక్టివ్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నెటిజన్లు అనేక ప్రశ్నలు కురిపించగా.. వాటిలో కొన్నింటికి అనుష్క ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఇక ఇందులో ఓ నెటిజన్ ‘మీ చుట్టూ ఉన్న వాళ్లు మిమ్మిల్ని పిల్లలు ఎప్పుడు కంటారు అని ప్రశ్నిస్తున్నారా’ అని అడిగాడు. దీనిపై స్పందించిన అనుష్క.. ‘లేదు. కేవలం సోషల్‌ మీడియాలోనే ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు’ అని సరదాగా బదులిచ్చారు. (వారికి సాయం చేయండి: విరుష్క)

కోహ్లికి ఏమంటే ఇష్టంలేదు అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఓడిపోవడం అంటే మా ఆయనకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు. ‘కోహ్లిలీ నుంచి ఎలాంటి హెల్ఫ్ తీసుకుంటూ ఉంటారు’ అని మరో నెటిజన్​ ప్ర‌శ్నించగా, ‘టైట్ గా ఉన్న బాటిల్​ మూతలు తీయడానికి, బరువైన కుర్చీలు ఎత్తేందుకు’ అని పేర్కొన్నారు. ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్  హీరోయిన్ అనుష్క శర్మ 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి దాదాపు మూడు ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ పిల్లల్ని కనలేదు. అంతేగాక ఇటీవల భార‌త క్రికెట్ టీమ్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా తండ్రవడంతో అప్పటి నుంచి విరుష్క జోడీ గురించే చ‌ర్చ సాగుతుంది. వీరు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారో అంటూ నెటిజన్లు ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. (ఆమె వల్లనే నాలో ఈ మార్పు: కోహ్లి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా