దళిత మహిళపై దారుణం: అత్యాచారం, ఆపై ముక్క ముక్కలుగా చేసి..!

3 Nov, 2023 15:20 IST|Sakshi

 హృదయం కలిచి వేస్తోంది: యూపీలో దారుణంపై అఖిలేష్ యాదవ్

బీజేపీ సర్కార్‌పై  మహిళలకు విశ్వాసం పోయింది

ఉత్తరప్రదేశ్‌లో  దారుణం చోటు చేసుకుంది.  40 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన కలకలం  రేపింది.  బందా లోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటౌరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందంటూ ప్రతిపక్షం మండి పడింది. 

పోలీసు అధికారి సమాచారం ప్రకారం రాజ్‌కుమార్‌ శుక్లాకు చెందిన పిండి మిల్లును శుభ్రం చేసేందుకు బాధిత మహిళ వెళ్లింది.  అయితే ఆమె ఎంతకీ తిరిగి రావడంతో  ఆమె కుమార్తె అక్కడికి చేరుకుంది. అయితే అక్కడున్న గది లోపనుంచి గడియ వేసి ఉండటం, తల్లి  అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించింది. దీంతో స్థానికుల సాయంతో కాసేపటి  తలుపులు తెరిచి చూడగా ముక్క ముక్కలుగా పడి ఉన్న తలి మృతదేహాన్నిచూసి    తీవ్ర  భయాందోళకు లోనైంది. దీంతో ఈఘటనపై పోలీసులను ఆశ్రయించింది.  సంఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితులుగా రాజ్‌కుమార్‌ శుక్లా, అతని సోదరుడు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ,  ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంతన హృదయాన్ని కలచి వేసిందని, బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పూర్తిగా విశ్వాసం కోల్పో యారంటూ ట్వీట్‌ చేశారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు ఈ ఘటన చెంప పెట్టు లాంటిదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఐఐటి-బిహెచ్‌యు విద్యార్థినిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, వీడియో తీసిన ఘటనను యాదవ్ ప్రస్తావించారు. దీనికి  సంబంధించిన వీడియోను కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు