దివ్య, స్వామి మంచి స్నేహితులు

15 Oct, 2020 15:45 IST|Sakshi

మీడియాతో బాధితురాలి సోదరుడు

సాక్షి, విజయవాడ : నగరంలో చోటు చేసుకున్న ప్రేమోన్మాదం ఘటనపై బాధితురాలి సోదరుడు స్పందించాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి తమకు చిన్నప్పటి నుంచి తెలుసునన్నాడు. దివ్య, చినస్వామి మంచి స్నేహితులని, అతడెందుకు ఉన్మాదిలా ప్రవర్తించాడో తెలియడం లేదన్నాడు. తన చెల్లెలి చావుకు కారణమైన స్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు. 

అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నాం: సీపీ
నగర కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకి చేరుకుని బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. వారి వద్దనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘11.30 మధ్య దాడి జరిగిందని సమాచారం వచ్చింది. నిందితుడు నాగేంద్రబాబు అలియాస్‌ స్వామి దివ్య తేజస్విని గొంతుపై కత్తి దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆసుపత్రిలో చనిపోయింది. అతడు కూడా కత్తితో పొడుచుకోవటంతో పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఎవరూ లేరు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నా’’మని తెలిపారు. ( బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది )

దివ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ప్రేమోన్మాది దాడిలో బలైన ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర వారిని కలిసి మాట్లాడి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు