ఎల్విష్‌ రేవ్‌ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్‌ ఎవరిది?

3 Nov, 2023 17:56 IST|Sakshi

 ట్రాప్‌  ఎవరిది? ఎల్విష్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి పోయాడా?

ఇదో పెద్ద రాకెట్‌  కింగ్‌పిన్‌ ఎల్విషే, అరెస్ట్‌ చేయండి : మేనకా గాంధీ 

రేవ్‌పార్టీ, కోబ్రా విషం లాంటి సంచలన ఆరోపణలు ఎదుర్కొటున్న యూ ట్యూబర్‌ బిగ్ బాస్ OTT సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ వ్యవహారంలో ట్విస్ట్‌లు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో తనకేమీ సంబంధంలేదనీ ఎల్విష్‌ వాదిస్తుండగా, అతడే కీలక సూత్రధారి కచ్చితంగా అరెస్ట్‌ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈకేసులో అతని జోక్యంపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు రాలేదని పోలీసులు తాజాగా తేల్చారు. దీంతో అసలీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది.   మేనకా గాంధీ ఎందుకు  స్పందించారు లాంటి వివరాలు ఒకసారి చూద్దాం...

యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌-2 (హిందీ) విజేత ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) పాములు, పాముల విషంతో రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎల్విష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సంచలనం రేపింది.  అయితే  ఈ కేసులో తనను అరెస్టు చేసినట్లు ఆరోపణలు, ఇతర వాదనలు అవాస్తవమని పేర్కొన్నాడు. తనపై అసత్యం ప్రచారం జరుగుతోందంటూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.   డ్రగ్స్ వ్యాపారం  చేస్తున్నానంటూ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం  ఎంతమాత్రం నిజంలేదని, అసలు ఈ కేసుకు, తనకు  ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలంటూ ఉత్తర  ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి  చేశాడు. అంతేకాదు  ఈ వ్యవహారంలో  తనప్రమేయం ఉందని తేలితే  తదనంతర పరిణామాలకు, తాను బాధ్యత వహిస్తానన్నాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని  పేర్కొన్నాడు. అంతేకాదు ఈ విషయంలో ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావించ వద్దని యూపీ పోలీసులను కోరాడు. 

అతడే కింగ్‌ పిన్‌, అరెస్ట్‌  చేయండి
మరోవైపు ఈ ఘటనపై  బీజేపీ ఎంపి మేనకా గాంధీ  స్పందించారు. ఎల్విష్ యాదవ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మేనకా గాంధీ  డిమాండ్‌ చేశారు. అంతేకాదు అతను నిర్దోషి కాకపోతే, ఎందుకు పరారీలో ఉన్నాడని ఆమె ప్రశ్నించారు. వన్యప్రాణుల  చట్టం కింది. ఇది గ్రేడ్ 1 నేరం, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే చాలా వీడియోలలో అంతరించిపోతున్న జాతుల పాములను ఉపయోగిస్తాడు.  నోయిడా,  గురుగ్రామ్‌లలో పాము విషాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం తమ వద్ద ఉందని స్పష్టం చేశారు.  కింగ్ కోబ్రాస్ విషాన్ని బయటకు తీస్తే చనిపోతాయనిప తెలిపారు. ఆహారం జీర్ణం కావడానికి ఈ విషం తోడ్పడుతుందని, విషం లేకుండా ఏమీ తినలేక చనిపోతాయన్నారు. దేశంలో నాగుపాములు, కొండ చిలువలు చాలా తక్కువ.. వాటిని సొంతం చేసుకోవడం నేరమని వాటిని కాపాడాలని ఆమె మీడియాకు వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉండవచ్చని, ఈ స్మగ్లింగ్‌కు సంబంధించినమొత్తం వ్యవహారంలో కింగ్‌పిన్ అతడేనని మేనకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 

మొన్న ఇస్కాన్‌.. ఇపుడు నేను, ఇలా  అయితే లోక్‌ సభ సీటు  వచ్చేస్తుందా?
మేనకా గాంధీ వ్యాఖ్యలు తనకు షాకింగ్‌ అనిపించాయని  దీనిపై తనకు  క్షమాపణలు  చెప్పాలంటూ  ఎల్వీష్‌​   ట్వీట్‌ చేశాడు. మొన్న ఇస్కాన్‌ మీద ఆరోపణలు, ఇపుడు తనను టార్గెట్‌ చేశారు... ఇలా లోక్‌సభ టిక్కెట్‌ వస్తుందా అంటూ ఎల్విష్ యాదవ్ మేనకా గాంధీపై విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉండగా ఎల్విష్ పాముతో ఆడుకుంటున్నట్లు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పీపుల్ ఫర్ యానిమల్స్ ట్రాప్‌
మేనకా గాంధీ ఫౌండర్‌గా ఉన్న స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ యానిమల్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఎన్జీవోనే ఎల్విష్ యాదవ్‌ను సంప్రదించి, రేవ్ పార్టీ నిర్వహించి, కోబ్రా విషం కావాలంటూ కోరింది. దీనికి సరేనన్న ఎల్విష్‌  దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశాడు.  కోబ్రా విషాన్ని తీసుకని రాహుల్  అనే అతను  సెక్టార్ 51 బాంకెట్ హాల్‌కు వచ్చాడు. దీంతో నోయిడా పోలీసులు డిఎఫ్‌ఓతో పాటు అతగాడిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ , మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైనాయి. అలాగే  దు కోబ్రాలతో సహా తొమ్మిది పాములను కూడా రక్షించారు. రాహుల్ నుంచి  20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం  చేసుకున్న పోలీసులు దాన్ని  విచారణ నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు