స్నేహితులతో కలిసి కన్న కూతురిపైనే అకృత్యం

7 May, 2021 12:52 IST|Sakshi

కుమార్తెపై అమానుషం

కీచక తండ్రికి 60 ఏళ్ల జైలు  

టీ.నగర్‌ (తమిళనాడు): స్నేహితులతో కలిసి కన్నకూతురిపైనే సామూహిక లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి న్యాయస్థానం 60 ఏళ్ల జైలు, అతని స్నేహితులకు 40 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈరోడ్‌ జిల్లా గోబి సమీప గ్రామానికి చెందిన బాలిక(10) తండ్రి, తమ్ముడితో నివసిస్తోంది. తండ్రి చిత్రహింసలు భరించలేక ఆమె తల్లి ఎటో వెళ్లిపోయింది. 2019లో బాలిక తండ్రి, స్నేహితులు అరుణాచలం (35), మణికంఠన్‌ (33) కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

స్థానికులు గోబి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన ఈరోడ్‌ జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి మాలతి బుధవారం తీర్పు వెలువరించారు. బాలిక తండ్రికి మూడు సెక్షన్ల కింద 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే, మిగతా ఇద్దరికి రెండు సెక్షన్ల కింద 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 

చదవండి: విద్యార్థినికి అబార్షన్‌.. యువకుడికి యావజ్జీవం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు