పరోట తిని వ్యక్తి మృతి

26 Nov, 2023 09:53 IST|Sakshi

అన్నానగర్‌: పరోట తిన్న కొద్దిసేపటికే ఛాతి నొప్పితో వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని సిత్తర్‌పట్టికి చెందిన రామకృష్ణన్‌ (39) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ సదురగిరిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. అదే పట్టణానికి చెందిన వీరముత్తు, రామకృష్ణన్‌ లారీలో సరుకులు ఎక్కించుకుని నిలకోటై సమీపంలోని విలంపట్టి ప్రైవేట్‌ మిల్లుకు వచ్చారు.

 గురువారం రాత్రి ఇద్దరూ అక్కడున్న ఓ కేఫ్‌లో పరోటా తిన్నారు. కొద్దిసేపటికి రామకృష్ణన్‌కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం నిలకోటై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. అతని తల్లి ఇన్బవల్లికి.. పోలీసులకు సమాచారం అందించారు. విలంపట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు