రోడ్డు ప‍్రమాదంలో ఐదుగురు మృతి.. రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

16 Mar, 2022 07:08 IST|Sakshi

ఛత్తీస్​గఢ్: ఛత్తీస్​గఢ్​లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప‍్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోబా సమీపంలో ఓ ట్రక్కు-ట్రాకర్ట్‌ ఢీకొట్టుకున్నాయి. ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స‍్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరంతా మొహ్లాయ్‌ గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితులందరూ మజర్‌ కట్టాకు చెందినవారని వెల్లడించారు.

మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్​​ బఘేల్​ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని.. గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని వార్తలు