హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది

13 Jun, 2021 14:42 IST|Sakshi

హాంకాంగ్: మధ్య చైనా నగరంలోని హుబీ ప్రావిన్స్‌లోని షియాన్‌ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనం‍లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 138 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఉదయం 6:30 గంటలకు జరిగిన ఈ ఘటనలో  పేలుడు ధాటికి ఆహార మార్కెట్ భవనం కూలిపోయింది.

ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న 150 మందిని రక్షించారు. ఇక మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని  షియాన్‌లోని  ఆసుపత్రులకు తరలించి  చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.

చదవండి: పెళ్లైన రెండో రోజే.. మాజీ ప్రియురాలి చేతిలో ప్రియుడి హత్య.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు