మార్ఫిం‍గ్‌ ఫోటోలతో బెదిరింపు : యువకుడి అరెస్ట్‌

1 Oct, 2020 20:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నిందితుడి అరెస్ట్‌

చెన్నై : తనతో సెక్స్‌ చాట్‌ చేయాలంటూ బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసి బెదిరింపులకు గురిచేసిన యువకుడి ఉదంతం కన్యాకుమారిలో వెలుగుచూసింది. బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు గురిచేసిన 17 ఏళ్ల యువకుడిని సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలిక మార్ఫింగ్‌ ఫోటోలను చూపి యువకుడు ఆమెను బెదిరించాడు. ఇన్‌స్టాగ్రాంలో బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు మార్ఫింగ్‌ ఫోటోలను చూపి తనతో సెక్స్‌ చాట్‌ చేయాలని పలమార్లు బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలికకు పంపిన మెసేజ్‌ల్లో తనతో సెక్స్‌ చాట్‌ చేయాలని నిందితుడు కోరాడు. తన మాట వినకుంటే మార్ఫింగ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. పోలీసులు నిందితుడి ఇన్‌స్టాగ్రాం ఖాతా వివరాల ఆధారంగా అతడిని ట్రేస్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. కన్యాకుమారిలో నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నైలోని జువెనిల్‌ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇలాగే ప్రవర్తించగా పోలీసులు హెచ్చరించి వదిలివేశారని దర్యాప్తులో వెల్లడైంది. చదవండి : బాధితురాలిని చిత్ర‌హింస‌లకు గురిచేశారు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు