‘వెంకట్ నారాయణ కేసులో టీడీపీ హైడ్రామా చేస్తోంది’

24 Dec, 2021 12:05 IST|Sakshi

సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం బోయపాలెంలో గాయపడ్డ తెలుగుదేశం కార్యకర్త వెంకటనారాయణ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా క్రైమ్ డీఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి మాట్లాడుతూ..  కేసును పూర్తిస్థాయిలో విచారించాగా అందులో.. వెంకట్ నారాయణ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు లో కాపర్ వైర్ దొంగిలించే దొంగగా తేలిందన్నారు. అంతకు ముందే వెంకట్ నారాయణ పై 11 కాపర్ వైరు దొంగతనాలు కేసులు నమోదు కావాడంతో పాటు నాలుగు నెలల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు.

బోయ పాలెం సమీపంలో వైజయంతి స్పిన్నింగ్ మిల్ లోని ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ ను దొంగతనం చేయడానికి ప్రయత్నించగా, దొంగతనం చేస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ రావడంతో కరెంట్ షాక్ తగిలి అతనికి గాయాలయ్యాయని చెప్పారు. ఆ స్పిన్నింగ్ మిల్లు వాచ్‌మెన్‌ 108కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారని తెలపారు. అయితే వెంకట్ నారాయణను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ హైడ్రామా చేస్తోందని, అతని పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి అతనిపై పెట్రోలు పోసి తగలబెట్టారంటూ తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఈ కేసును గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు