ఛీ వీడు తండ్రేనా.. కన్నకొడుకు, కూతురుపై

26 Jul, 2021 07:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కూతురు, కుమారుడి పట్ల అసభ్య ప్రవర్తన 

సాక్షి, బంజారాహిల్స్‌( హైదరాబాద్‌): కన్నకొడుకు, కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు(45) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.70లో నివాసం ఉంటాడు. అతడికి 2003లో వెంకటగిరికి చెందిన మహిళ(40)తో వివా హం జరిగింది.

అమెరికాలో ఉండే ఈ దంపతులు 2010లో నగరానికి తిరిగి వచ్చారు. వీరికి కూతురు(14), కొడుకు(11) ఉన్నారు. 2018లో కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కూతురు, కుమారుడు అన్యమనస్కంగా ఉంటుండటంతో ఆందోళన చెందిన తల్లి సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించగా మూడేళ్ల క్రితం తమ పై తండ్రితో పాటు అతడి స్నేహితుడు అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడ్డట్లు తేలింది. ఎవరూ లేని సమయంలో తన శరీర భాగాలను తాకుతూ తండ్రి, అతని స్నేహితుడు(45) అసభ్యంగా ప్రవర్తించారని కూతురు చెప్పగా తనను నగ్నంగా చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని కుమారుడు చెప్పుకొచ్చాడు. దీంతో తల్లి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో చ ట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితు డిని అరెస్ట్‌ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు