భార్యతో విడాకులు.. డిన్నర్‌ కోసం పొద్దున వెళ్లి తలుపులు కొట్టగా.. 

18 Aug, 2021 08:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్(హైదరాబద్): భార్యతో విడాకులు ఇచ్చిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–3లోని యూబీఐ కాలనీలో నివసించే ఆదిత్యసాయి డాగా(28)కి ఆరు నెలల క్రితం విడాకులు అయ్యాయి.

అప్పటి నుంచి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు తన గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డిన్నర్‌ కోసం తల్లి గది వద్దకు వెళ్లి తలుపులు కొట్టగా ఎంతకీ తీయకపోయేసరికి తలుపులు విరగ్గొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. తండ్రి సాయిలాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

మరిన్ని వార్తలు