యువకులే ఆమె టార్గెట్‌.. వీడియో కాల్‌ చేసి రికార్డింగ్‌.. న్యూడ్‌ వీడియోతో బెదిరింపు

23 Sep, 2022 16:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి న్యూడ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసే ఓ ఉద్యోగి గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ సమీపంలోని హాస్టల్‌లో నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇన్‌స్టా‍గ్రామ్‌లో ఓ యువతితో పరిచయం అయింది.

ఈ క్రమంలో వీడియో కాల్‌ మాట్లాడిన యువతి కాల్‌ను రికార్డు చేసి రూ.10వేలు పంపాలని లేకపోతే దాన్ని న్యూడ్‌ వీడియోగా మార్చి సోషల్‌ మీడియాలో పెట్టడమే కాకుండా ఫ్రెండ్స్‌ అందరికీ పంపిస్తానని డిమాండ్‌ చేసిందని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బులు పంపితే వీడియోకాల్‌ను డిలీట్‌ చేస్తానని స్పష్టం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ యువతి న్యూడ్‌ కాల్స్‌ పేరుతో యువకులను ట్రాప్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: ‘నా డెత్‌ సర్టిఫికెట్‌ పొగొట్టుకున్నాను’.. వైరలవుతోన్న పేపర్‌ యాడ్‌

మరిన్ని వార్తలు