పెళ్లి కావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

18 Aug, 2021 08:56 IST|Sakshi

సాక్షి, కాచిగూడ(హైదరాబద్): పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప­డ్డాడు. ఈ విషాదకర  ఘటన కాచిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న మైనుద్దీన్‌ కుమారుడు సయ్యద్‌ మోహినుద్దీన్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లికావడం లేదని  జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మోహినుద్దీన్‌ ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: Raja Raja Chora: కథ లేకుండా కామెడీ నడిపించలేం! 

మరిన్ని వార్తలు