వెంటపడి మరీ ప్రేమించాడు...పెళ్లికి మాత్రం నో

23 Jun, 2022 07:59 IST|Sakshi

బంజారాహిల్స్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు  ఓ యువతిని ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్‌ పోలీసులు ఈ కేసును జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసి తదుపరి విచారణకు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లో నివసించే భాను ప్రకాశ్‌(21)కి 2020లో ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్యా పరిచయం కుదిరింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. కొద్ది రోజులకే ఆ యువతితో పెళ్లి చేసుకుంటానంటూ చెప్పగా ఆమె అందుకు అంగీకరించలేదు.

చాలా రోజులుగా ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఆమె చివరకు అంగీకరించింది. 2020 నవంబర్‌ 11న భాను ప్రకాశ్‌ బైక్‌పై ఆమె ఇంటికి వెళ్లి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని తన గదికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా ఏడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భాను ప్రకాశ్‌ మరో యువతితో చాట్‌ చేస్తున్నాడని గమనించిన బాధిత యువతి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇందుకు నిరాకరించిన సదరు యువకుడు తనకు ఇప్పుడు పెళ్లి అవసరం లేదని, నువ్వు కూడా అవసరం లేదంటూ ముఖం మీద చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: నెంబర్‌ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు)

మరిన్ని వార్తలు