కశ్మీర్‌లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు

23 Sep, 2021 11:08 IST|Sakshi

శ్రీనగర్‌: ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగం విధుల నుంచి తప్పింది. తాజాగా ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను బుధవారం ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేశామని అధికారులు చెప్పారు. గత 6 నెలల కాలంలో మొత్తంగా 25 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగింనట్లు కశ్మీర్‌ అధికారులు వెల్లడించారు.

పాక్‌ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్‌ మొజాహిదీన్‌ ఉగ్రసంస్థ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ ఇద్దరు కుమారులనూ గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగింది. శ్రీనగర్‌లో శాసన మండలి సభ్యుని ఇంట్లో ప్రభుత్వ ఆయుధాలను దొంగిలించిన కానిస్టేబుల్‌ షౌకత్‌ ఖాన్‌ను పక్కకు తప్పించారు. 

చదవండి: రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్‌

మరిన్ని వార్తలు