బాలుడి కిడ్నాప్‌.. సోషల్‌మీడియా సాయంతో కథ సుఖాంతమైంది!

29 Jan, 2022 16:32 IST|Sakshi
ప్రదీప్‌తో హర్యానాలో దాబా యజమాని విడుదల చేసిన చిత్రం

కొరాపుట్‌(భువనేశ్వర్‌): ట్రక్‌ డైవర్‌ కిడ్నాప్‌ చేసిన బాలుడు సోషల్‌ మీడియా సాయంతో ఇంటికి చేరిన ఘటన అందరినీ ఆనందంలో ముంచెత్తింది. నవరంగపూర్‌ జిల్లా ఎస్పీ పురుషోత్తం దాస్‌ దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించారు. 2021 అక్టోబర్‌ 22న నవంరంగ్‌పూర్‌ జిల్లా చందాహండి పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఖపరాది గ్రామంలో ఓ ట్రక్‌ డ్రైవర్‌ ప్రదీప్‌ అనే బాలుడిని అపహరించి, ఎత్తకుపోయాడు. (చదవండి: గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి.. )

దీనిపై అదేరోజు చందాహండి పోలీస్‌ స్టేషన్‌లోకేసు నమెదయ్యింది. బాలుడిని ట్రక్‌ డ్రైవర్‌ హర్యనాలోని రేవాడి జిల్లా గొడిబాల్ని జంక్షన్‌ వద్ద జాతీయ రహదారి–6పై డిసెంబర్‌ 21న రాత్రి వదలి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న హరున్‌ధావన్‌ దాబాకు చేరిన ప్రదీప్‌ ఉదంతాన్ని దాబా యజమాని వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారి, నవంరంగ్‌పూర్‌ జిల్లాకు చేరింది.

దీనిపై ఎస్పీ జోక్యం చేసుకొని, హర్యానాలోని బాలసదన్‌కు సమాచారం అందించి, సంరక్షించారు. అనంతరం ప్రదీప్‌ సోదరుడు భుజభల్‌ని జిల్లా పోలీసుల బృందంతో అక్కడకు పంపించి, నవరంగపూర్‌ లోని కుంటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా, పోలీసులు చేసిన సాయాన్ని మరువలేమని కన్నీటి పర్యంతమవుతున్నారు.

మరిన్ని వార్తలు