పెళ్లైన 22 రోజులకే.. అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి

22 Jun, 2021 13:00 IST|Sakshi
అనూష.. సౌజన్య (ఫైల్‌)

సాక్షి, మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. మీర్జాలగూడకు చెందిన కాశీనాథ్‌ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పగా వారి వివాహానికి అంగీకరించారు. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటామని అనూష చెప్పడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. రిజిస్టర్‌ వివాహం చేసుకోవడానికి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తుండటంతో ఈ నెల 20 వ తేదీ రాత్రి కాశీనాథ్‌ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి
ఉప్పల్‌: 
అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ కేసీఆర్‌నగర్‌కు చెందిన నాగరాజు గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తాడు. ఇతని భార్య సౌజన్య(26) సోమవారం ఉదయం మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి సోదరుడు లింగ స్వామి ఫిర్యాదు మేరకు ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నాంపల్లికి చెందిన వారు. 22 రోజుల క్రితమె పెళ్లి జరిగినట్లు మృతురాలి సోదరుడు తెలిపారు. 

చదవండి: 
నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు