చెప్పిన కూర వండలేదనే కోపంతో భార్యని..

1 Sep, 2021 19:58 IST|Sakshi

భోపాల్‌: ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొన్ని వాటిలో చిన్న చిన్న గొడవలే హ‌త్య‌లకు దారితీస్తున్నాయి. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్లో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. చికెన్‌ కూర వండ‌లేదన్న కోపంతో ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను క‌ర్ర‌తో బలంగా కొట్టడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. ఈ ఘటన ఆగస్టు 23న రాత్రి జ‌రగగా, ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

చికెన్‌ కూర వండలేదని..
వివరాల్లోకి వెళితే..  షాదోల్ జిల్లాలోని సెమారియాటోల గ్రామానికి చెందిన క‌మ్లేష్ కోల్‌, రాంబాయ్ కోల్ ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. గ‌త ఆగస్టు నెల 23న రాత్రి క‌మ్లేష్ కోడికూర వండాలని తన భార్య‌కు చెప్పాడు. కానీ ఆమె అందుకు నిరాక‌రించింది. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య గొడవ మొదలైంది. అది కాస్త పెద్దది కావడం.. కోపంతో క‌మ్లేష్ కోల్ అందుబాటులో ఉన్న ఓ క‌ర్రని తీసుకుని భార్య‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టాడు. దాంతో ఆమె త‌ల‌కు తీవ్ర గాయ‌మై ప్రాణాలు కోల్పోయింది.

అయితే, కమ్లేష్‌ తన భార్య ప్ర‌మాద‌వ‌శాత్తు త‌గిలిన గాయాలతో చనిపోయిందని ఇరుగుపొరుగు వారికి చెప్పి అప్ప‌ట్లో ఆమె అంత్య‌క్రియ‌లు పూర్తిచేశారు. కానీ పోస్టు మార్టం రిపోర్టులో ఆమె త‌ల‌పై క‌ర్ర‌తో బ‌లంగా కొట్టడంతో మరణించిందని తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా అసలు నిజం బయటపడింది. దీంతో పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

చదవండి: అడక్కుండానే పానీ పూరి తెచ్చిన భర్త.. కోపంతో ఊగిపోయిన భార్య, చివరకు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు