బెజవాడ మహేష్‌ హత్య : చేధించిన పోలీసులు

20 Oct, 2020 19:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి గజకంటి మహేష్‌ హత్యకేసును చేధించినట్లు సిటీపోలీస్‌ కమిషనర్‌ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం విజయవాడలో కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ' మూడు రోజులపాటు అన్ని కోణాల్లో కేసు విచారణ చేసిన ప్రత్యేక బృందం అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారమే మహేష్‌ హత్య జరిగినట్లు స్ఫష్టమైంది. మహేష్‌ని తుపాకీ తో కాల్చి హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాం. మద్యం మత్తులో వివాదం జరగడంతోనే హైదరాబాద్ కి చెందిన సాకేత్ రెడ్డి మహేష్‌పై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన జరిగినపుడు సాకేత్ రెడ్డితో పాటు గంగాధర్ కూడా ఉన్నట్లుగా నిర్థారణ అయింది. (చదవండి : బెజవాడ మహేష్‌ హత్య కేసులో కొత్త కోణం)

కాగా  సాకేత్ రెడ్డికి బెజవాడలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ రెడ్డి స్నేహితుడని.. రాధాకృష్ణ రెడ్డి ఆటోలోనే సాకేత్, గంగాధర్ మద్యం తాగటానికి వచ్చారు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయటంతో పాటు, మరొకరికి వార్నింగ్ ఇవ్వటానికి సాకేత్ రెడ్డిని పిలిపించాడు. అయితే  కిడ్నాప్ చేద్దాం అని వచ్చిన సాకేత్ మద్యం మత్తులో మహేష్‌తో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే సాకేత్‌ తుపాకీతో మహేష్‌పై కాల్పులు జరిపాడు . కాగా సాకేత్ ఎప్పుడూ తన వెంట రివాల్వర్ వెంటపెట్టుకొని తిరుగుతాడని.. అతను ఆ తుపాకీని బీహార్ గయాలో రూ. 45వేలకు కొనుగోలు చేశాడని' సీపీ బత్తిని శ్రీనివాస్‌ వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై కేసులు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని సీపీ పేర్కొన్నారు.(చదవండి : విజయవాడ నగర శివారులో దారుణ హత్య)
(చదవండి : పక్కా పథకం ప్రకారమే మహేష్‌ హత్య)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు