అనుమానం: ఫోన్‌ మాట్లాడుతుందని భార్యను కొట్టి చంపాడు

4 May, 2021 11:45 IST|Sakshi
భర్త, పిల్లలతో స్వప్న (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో విషాదం చోటు చేసు​కుంది. ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో రమేష్‌, స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉ‍న్నారు. అయితే గత కొంతకాలంగా తన భార్య స్వప్న తరచూ అర్ధరాత్రి వేరేవాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతుందని భర్త రమేష్‌ అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి కూడా అదే అనుమానంతో రమేష్‌ తన భార్య స్వప్నను త్రీవంగా కొట్టాడు. అనంతరం అదే గ్రామంలో ఉన్న స్వప్న తల్లిదండ్రులకు ఆమె ఆనారోగ్యంగా ఉందని తమ ఇంటికి రావాలని తెలిపాడు.

స్వప్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి చూడగా ఆమె అపస్మరక స్థితిలో కనిపించింది. వెంటనే స్వప్నను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్వప్నను తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలు తట్టుకోలేకనే మరణించిందని ఆమె బంధువులు రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రమేష్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు. స్వప్న మృతితో రుద్రారం గ్రామంలో  విషాద చాయలు అలుముకున్నాయి.
చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు