వివాహేతర సంబంధం తెలిసి భర్త మందలించాడు.. ప్రియుడితో కలిసి..

24 Nov, 2022 08:13 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): చెన్నై ఆవడిలో ప్రియురాలి భర్తను కత్తితో దాడి చేసి పారిపోయిన ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టాభిరామ్‌ సత్రం కరుమారి అమ్మన్‌ ఆలయ వీధికి చెందిన కార్తీక్‌ (35) అదే ప్రాంతంలో చికెన్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య ఇలాకియా (30). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంబత్తూరులో ఉన్న ఒక ఎక్స్‌పోర్టు కంపెనీలో ఇలక్య పని చేస్తోంది.

ఇదే కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాసన్‌ (32)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్‌ భార్యను మందలించాడు. దీంతో తన భర్తను హత్య చేయడానికి శ్రీనివాసన్‌తో కలిసి పథకం వేసినట్లు తెలిసింది. సోమవారం ఇంటల్లో ఉన్న కార్తీక్‌పై శ్రీనివాసన్, ఇలక్య కత్తితో దాడి చేశారు.

కేకలు విన్న స్థానికులు కార్తీక్‌ను వెంటనే ఆవడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఫిర్యాదు మేరకు పట్టాభిరామం పోలీసులు కేసు నమోదు చేసి భార్య ఇలక్యను విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీనివాసన్‌ కోసం గాలిస్తున్నారు.    

చదవండి: (కీచక కరస్పాండెంట్‌.. ప్లస్‌టూ విద్యార్థినులతో..)

మరిన్ని వార్తలు