బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం.. ఏం జరిగింది?

9 Jan, 2023 19:23 IST|Sakshi

సాక్షి, మెదక్‌ జిల్లా: అప్పటి వరకు బంధువులతో మాట్లాడిన వ్యక్తి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. అక్కా వస్తున్నా అని చెప్పిన తమ్ముడి రాక కోసం రాత్రంతా ఎదురుచూసి తెల్ల వారగానే అతని మరణ వార్త తెలియడంతో ఆమె తల్లడిల్లిపోయింది. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ధర్మా అనే వ్యక్తి సజీవదహనం కావడంతో టేక్మాల్‌ మండలం భీమ్లా తండాలో విషాదం నెలకొంది.

టెక్మాల్‌ మండలం వెంకటాపురం గ్రామ శివారులో కారులో వ్యక్తి  సజీవదహనం కావడం సంచలనంగా మారింది. కారు డోర్‌ వద్ద మృతుడి కాలు బయటకు రావడంతో ఇది ప్రమాదమా? లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధర్మాకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధర్మా మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు  సాగిస్తున్నారు.  గత అర్థరాత్రి  వ్యక్తిని కారులో​ వేసి ప్రెటోల్‌ పోసి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. కారు నంబర్‌ను దుండగులు పూర్తిగా దహనం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు