టిక్‌‘టాక్‌’ ప్రేమ.. ఆమెకు ఇలాంటివి కొత్తేమీ కాదు..

7 Oct, 2020 08:30 IST|Sakshi
మాట్లాడుతున్న మంజుల

ప్రేమికుడు వంచించి ముఖం చాటేశాడన్న యువతి

ఆమెకు ఇది కొత్త కాదు..మరోసారి అదే తరహాలో ఫిర్యాదు : డీఎస్పీ

సాక్షి, మదనపల్లె : టిక్‌టాక్‌లో పరిచయమైన ప్రేమికుడితో తనకు పెళ్లి చేయాలని ఓ యువతి ప్రెస్‌క్లబ్‌ను ఆశ్రయించింది. ప్రేమ పేరిట తనను వంచించాడని తీరా పెళ్లి చేసుకుంటే ముఖం చాటేశాడని పేర్కొంది. బాధితురాలు మంజుల కథనం ప్రకారం... వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన ఫొటోగ్రాఫర్‌ కమ్మరి బ్రహ్మయ్య(23)తో పీలేరుకు చెందిన మంజులకు టిక్‌టాక్‌లో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

కరోనా కారణంగా కమ్మరి బ్రహ్మయ్యకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రూ.20,000 వరకు సాయం చేసింది. తీరా పెళ్లిచేసుకుందామని అడిగితే ఇంట్లో వాళ్లు అంగీకరించలేదని బ్రహ్మయ్య ముఖం చాటేశాడు.  దీంతో ఆమె పీలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఆధార్‌ కార్డు ప్రకారం అబ్బాయి వయస్సు 17 ఏళ్లు అని, వాళ్ల తల్లిదండ్రులు కేసు పెడితే మంజులకే ఇబ్బందులు తప్పవని ఎస్‌ఐ చెప్పారట!  వాస్తవానికి కమ్మరి బ్రహ్మయ్య తనకంటే రెండేళ్లు పెద్దవాడని, పాస్‌పోర్ట్‌లో కచ్చితమైన వయస్సు నమోదైనట్లు ఆమె పేర్కొంది.  (బాలికపై అత్యాచార యత్నం: ప్రతిఘటించిన సోదరి)

బ్రహ్మయ్యతో తనకు వివాహం చేయించాలని కోరింది. దీనిపై డీఎస్పీ రవిమనోహరాచారి కోరగా..మంజులకు ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదని చెప్పారు. 2019 ఆగస్టు 15న ఆమె రాజ్‌కుమార్‌ అనే యువకుడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు పంపామన్నారు. ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో ఫిర్యాదు చేస్తోందన్నారు. మంజులను బ్రహ్మయ్య మోసం చేసినట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, వివాహం చేయించమంటే అది తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా