Nagarjuna Akkineni: రంగులు గుమ్మరించినట్లుగా ఉన్న ఈ షర్ట్‌ ధరెంతో తెలుసా?

28 Nov, 2023 11:59 IST|Sakshi

తెలుగు ఇండస్ట్రీలో మన్మథుడు ఎవరనగానే నాగార్జున అని టపీమని చెప్పేస్తారు. 64 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నాడు కింగ్‌. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిగ్‌బాస్‌ షోకి హోస్టింగ్‌ చేస్తున్నాడు. వీకెండ్‌లో హౌస్‌మేట్స్‌కు క్లాసులు పీకుతూ తర్వాత వారితో గేమ్స్‌ ఆడిస్తూ ఉంటాడు. శని, ఆదివారాల్లో స్పెషల్‌గా డిజైన్‌ చేసిన డ్రెస్సుల్లో దర్శనమిస్తుంటాడు నాగ్‌. కొన్ని చిత్రవిచిత్రంగా ఉన్నా నాగ్‌కు మాత్రం పర్ఫెక్ట్‌గా సరిపోతుంటాయి.

అలా మొన్నటి శనివారం..  రంగులతో పెయింట్‌ వేసినట్లుగా ఉన్న షర్ట్‌ ధరించాడు. వాలెంటినో బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్‌ ధర ఏకంగా రూ.1,03,019గా ఉంది. ఆదివారం రోజు ఆయన వైట్‌ స్వెట్‌షర్ట్‌ ధరించాడు. లూయిస్‌ వ్యూటన్‌కు చెందిన దీని ధర ఏకంగా రూ.1,82,016 అని తెలుస్తోంది. ఆరోజు ఆయన వేసుకున్న  షూ ధర కూడా లక్ష పై చిలుకే ఉండటం గమనార్హం. ఎంతైనా స్టార్‌ హీరో కదా.. ఆమాత్రం మెయింటెన్‌ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం నాగ్‌ 'నా సామిరంగా' సినిమా చేస్తున్నాడు.

చదవండి: మహేశ్‌బాబు సినిమా 10 సార్లు చూసి ఎంపీనయ్యా.. మల్లారెడ్డి స్పీచ్‌ వైరల్‌

మరిన్ని వార్తలు