ఫేస్‌బుక్‌ పరిచయం.. మోడలింగ్‌ చాన్స్‌ ఇప్పిస్తానని చెప్పి.. ఆపై

18 Jun, 2021 11:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక):  బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బిల్వర్థహళ్లి గ్రామ పంచాయతీ సభ్యుడు అహ్మద్‌పాషా తనను గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. హెబ్బాళ సమీపంలో  నివాసం ఉంటున్న యువతి మోడలింగ్‌ రంగంపై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో బిల్వర్థహళ్లి జీపీ సభ్యుడు అహ్మద్‌పాషా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు.

మోడలింగ్‌ రంగంలో ఆమెకు ఆసక్తి ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆ యువతి శ్యానబోగనహళ్లిలోని అహ్మద్‌ నివాసానికి వెళ్లగా మాటలు కలిపి అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించింది. అయితే నిందితుడు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతిని నగ్నంగా ఫొటోలు తీశాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అహ్మద్‌ పాషా కోసం గాలింపు చేపట్టారు.

చదవండి: విషాదం: బతుకు దెరువు కోసం వచ్చి.. మున్నేరువాగులో గల్లంతు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు