షాకింగ్‌: రోడ్డుపై దారుణ హత్య.. ఆపై

28 Oct, 2020 15:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై అతీ సమీపం నుంచి కాల్పులు జరిపిన దుండగుడు, సెల్‌ఫోన్‌లో మృతుడి ఫొటోలు తీసుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా అక్టోబరు 22న ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతడు నేరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. వివరాలు.. ఈ కేసులో నిందితుడైన పవన్‌ గహ్లోత్‌, సోదరుడు ప్రవీణ్‌ గహ్లోత్‌ 2019లో వికాస్‌ దలాల్‌ చేతిలో హతమయ్యాడు. (చదవండి: పొరుగింటి వ్యక్తి షాపును కూల్చేసిన యువకుడు)

ఆ తర్వాత కొన్నాళ్లకు పోలీసుల చేతికి చిక్కిన దలాల్‌ ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. అయితే సోదరుడి మరణంతో తీవ్రంగా కలత చెందిన పవన్‌, దలాల్‌ మృతి చెందడంతో అతడి అనుచరులనైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతా కలిసే కుట్ర పన్ని తన సోదరుడు ప్రవీణ్‌ను హతమార్చారనే కోపంతో దలాల్‌ దగ్గర పనిచేసే ప్రదీప్‌ సోలంకి, అతడితో సంబంధాలు కలిగి ఉన్న వికాస్‌ మెహతా కదలికలపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం, మోహన్‌గార్డెన్‌ ఏరియాలో మాటువేసి వికాస్‌ మెహతాను పట్టుకున్నాడు. అతడిని వెంబడించి అతి సమీపం నుంచి కాల్పులు జరపగా మృతి చెందాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా