యువకుడితో వివాహేతర సంబంధం.. పెళ్లి నిశ్చయమయింది.. వదిలేయాలని వేడుకున్నా..

28 Dec, 2022 07:35 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వివాహిత– యువకుని ఉదంతంలో ఆమె హత్యకు గురైంది. ఈ సంఘటన కనకపుర పట్టణ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు... పట్టణ పరిధిలోని కురుపేట వీధి రోడ్డు నివాసి శ్రుతి (28) హతురాలు. శ్రుతి భర్త గార పని చేస్తుండగా, ఆమె ఇళ్లలో పనికి వెళ్లేది.

ఆమెకు మొబైల్లో ఫేస్‌బుక్‌ ద్వారా హనుమంతు అనే అవివాహిత యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. కొన్ని రోజులుగా అతడు ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. అయినా శ్రుతి పదేపదే ఫోన్‌ చేసి హనుమంతును కలవాలని ఒత్తిడి చేసేది. దీంతో విసిగిపోయిన హనుమంతు శ్రుతి ని వదిలించుకోవాలని, బైక్‌పై మారణ్ణదొడ్డి రోడ్డుకు తీసికెళ్లి బెల్ట్‌తో గొంతు బిగించి హత్య చేశాడు.  

బెదిరించడం వల్లనే..  
ఈ నేపథ్యంలో పోలీసులు హనుమంతును అరెస్టు చేశారు. తనకు వేరే అమ్మాయితో వివాహం నిశ్చయమయిందని, వదిలేయాలని ఎంత వేడుకున్నా శ్రుతి వినిపించుకోలేదన్నాడు. ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, తనతోనే ఉండాలని బెదిరించేదని చెప్పాడు. అందుకే ఆమెను బైక్‌పై తీసికెళ్లి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

చదవండి: (చేదు మిగిల్చిన షుగర్‌ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు