వ్యభిచార దందా.. ఒక మహిళ.. ఇద్దరు యువతులను రప్పించి..

8 Dec, 2021 12:50 IST|Sakshi

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌): జగిత్యాల రూరల్‌ మండలం తిమ్మాపూర్‌ శివారులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణకుమార్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ ఇద్దరు యువతులను తీసుకొని వచ్చి తిమ్మాపూర్‌ శివారులోని ఇల్లు అద్దెకు తీసుకొని, వ్యభిచారం నిర్వహిస్తోంది.

పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి, జగిత్యాలకు చెందిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు, నిర్వాహకురాలు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట జగిత్యాల రూరల్‌ ఎస్సై అనిల్, పోలీసు సిబ్బంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు