హత్య చేసి.. సాక్ష్యం లేకుండా.. తల మాయం!

26 Jul, 2021 18:06 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని వాసాయి వెస్ట్‌లోని భూయ్ గావ్ బీచ్ సమీపంలో ఓ తలలేని మహిళ శవాన్ని పోలీసులు సోమవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. దుండగులు మహిళను హత్య చేసి, సాక్ష్యాలను మాయం చేయడానికి తలను మాయం చేసి సూట్‌కేసులో కుక్కి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు చాలా సున్నితమైనది కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించినట్లు జోనల్ డిప్యూటీ కమిషనర్ సంజయ్‌ కుమార్ పాటిల్ తెలిపారు.

ఆ మహిళ ఎవరనేది నిర్ధారించడానికి దర్యాప్తు బృందం ముంబై, పాల్ఘర్, థానే, నవీ ముంబైలోని పోలీస్ స్టేషన్‌లలో నమోదైన ఫిర్యాదుల కోసం విచారణ ప్రారంభించింది. కాగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302, 201 కింద వాసాయి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కుమార్‌ పాటిల్ తెలిపారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు