సైకో కిల్లర్.. మహిళలే టార్గెట్‌.. పోలీసులే విస్తుపోయే నిజాలు

9 Dec, 2023 15:37 IST|Sakshi

సాక్షి, తాండూరు: చిల్లర ఖర్చుల కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు. చివరికి సైకోగా మారిపోయాడు. మర్డర్స్ చేయడం హబీగా మార్చుకున్నారు. అందుకు అడ్డా మీద కూలీలనే టార్గెట్ చేసుకున్నాడు. హత్య చేయడం అంటే అతనికి నీళ్లు తాగినంత ఈజీ..  ఇప్పటికే ఆరు హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలేదు.  ఏడో హత్య చేసి పోలీసులకు మళ్లీ చిక్కిపోయాడు.  వికారాబాద్ జిల్లాను వణికించిన సైకో కిల్లర్ కిష్లయ్య స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం... అదృశ్యమైన మహిళ గురించి తాండూరు పోలీసులు చేసిన దర్యాప్తు చేస్తుండగా...ఈ సైకో కిల్లర్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

సర్వబీ.. ఊరు వికారాబాద్ జిల్లా తాండూరు.. నవంబర్ 29న ఉదయం 9 గంటల ప్రాంతం.. కూలీ పనుల కోసం సర్వబీ అడ్డా మీదికి వెళ్లింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. డిసెంబర్ ఒకటిన ఆమె భర్త మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. స్వరాబీ అదృశ్యమైన రోజున ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప వెంట వెల్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిన్ని క్లూ దొరికింది. కిష్టప్పపై ఫోకస్ పెట్టారు.

సైకో కిల్లర్ కిష్టప్ప బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేస్తే పోలీసులే విస్తుపోయారు. కిష్టప్పను అదుపులో తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. తాండూరులోని కూలీల అడ్డా మీద సర్వాబీని గ్రామంలో పని ఉందని చెప్పి వెంట తీసుకువెళ్లాడు. తాండూరు నుంచి జహీరాబాద్ వెళ్లే బస్సులో ఎక్కారు. మధ్యలో తట్టెపల్లి అటవీ ప్రాంతంలో బస్సు దిగి... లోపలికి తీసుకువెళ్లాడు. ఆమెను చీర కొంగుతోనే గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, మోబైల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదును తీసుకుని కిష్టప్ప సొంత ఊరు అల్లీపూర్ వెళ్లిపోయాడు.  పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారించగా.. డిసెంబర్ 7న అదృశ్యమైన మహిళ సర్వాబీ మృతదేహం పోలీసులు గుర్తించారు.

వికారాబాద్ జిల్లాలో కిష్టప్పపై ఆరు హత్య కేసులుండగా... ఐదు కేసుల్లో ఆధారాలు దొరకనివ్వలేదంటే అతని క్రిమినల్ మెంటాలిటీ ఎంటో అర్థం చేసుకోవచ్చు.    మరో కేసు విచారణలో రెండేళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సైకో కిల్లర్ కిష్టప్ప ఏడో హత్యకు తెగబడ్డాడు. పని ఇప్పిస్తానని చెప్పి ప్రాణాలు తీసే ఇలాంటి క్రిమినల్స్‌తో బీ కేర్ ఫుల్.. బీ అలర్ట్.

ఇదీ చదవండి: చికెన్‌ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్‌.. రూ.30 వేలు పరిహారం!

>
మరిన్ని వార్తలు