ఢిల్లీలో 25 స్వైన్‌ కేసులు

26 Nov, 2023 06:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్న దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్‌ ఫ్లూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో శనివారం ఒక్క రోజే 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ వెల్లడించింది.

వీటితో కలుపుకుని ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 153కు చేరాయని పేర్కొంది. స్వైన్‌ ఫ్లూతో పాటు ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌3ఎన్‌2) కేసులు కూడా పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రోగుల్లో న్యుమోనియా ఇన్ఫెక్షన్‌ కూడా కనిపిస్తోందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు