కీచక టీచర్లపై విద్యార్థిని ఫిర్యాదు

11 Jul, 2021 20:51 IST|Sakshi

సాక్షి, చెన్నై: ముగ్గురు కీచక టీచర్లపై శనివారం ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంత కాలంగా ఈ కీచక టీచర్లు సాగించిన వేధింపులపై విద్యార్ధిని సమర్పించిన ఆధారాలతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో విద్యార్థినులకు కేకేనగర్‌ పాఠశాల టీచర్లు ఇచ్చిన వేధింపుల వ్యవహారం తర్వాత పలు పాఠశాలల్లోని టీచర్లపై ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైలాపూర్‌ పీఎస్‌ స్కూల్‌లో పనిచేస్తున్న ముగ్గురు కీచకులపై ఓ విద్యార్థిని ఫిర్యా దు చేసింది.

స్కూల్‌లో చదువుకున్న సమయంలో శివకుమార్, జ్ఞాన శేఖరన్, వెంకట్రామన్‌ అనే ముగ్గురు టీచర్లు లైంగికంగా వేధించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మైలాపూర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా సుశీల్‌ హరి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు శివశంకర్‌బాబాపై ఇప్పటి వరకు 18 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఆయనపై మరో పోక్సో కేసు నమోదుకు పోలీసులు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు