ఎస్‌ఐ ‍స్కాం: అవును, బ్లూటూత్‌ వాడాను

28 Apr, 2022 08:29 IST|Sakshi

బనశంకరి: బ్లూటూత్‌ పరికరం ఉపయోగించి పరీక్షలో సమాధానాలు రాశాను. ఇందుకోసం రూ. 40 లక్షలను ముట్టజెప్పాను అని ఎస్‌ఐ పోస్టుల స్కాంలో పట్టుబడిన అభ్యర్థి సునీల్‌ చెప్పాడు. అతన్ని సీఐడీ అధికారులు విచారించగా అక్రమాలను బయటపెట్టాడు. ఆర్‌డీ పాటిల్‌ బ్లూటూత్‌ పరికరం ద్వారా సమాధానాలు చెప్పాడని, ఇందుకోసం రూ.40 లక్షలు తీసుకున్నాడని సునీల్‌ చెప్పాడు. ఈ పరీక్షలో సునీల్‌ ఉత్తీర్ణుడు కావడం గమనార్హం.  

అదనపు డీజీపీపై బదిలీ వేటు  
ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం ఐపీఎస్‌లకు ఇబ్బందిగా మారింది. పోలీస్‌ నియామక విభాగం అదనపు డీజీపీ అమృత్‌పౌల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఆంతరిక భద్రత విభాగానికి పంపించింది. ఇందుకు స్కామే కారణమని సమాచారం. త్వరలో మరికొందరు ఐపీఎస్‌లనూ బదిలీ చేయవచ్చని సమాచారం.  

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరెస్టు  
ఇటీవల మైసూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కర్ణాటక విశ్వవిద్యాలయం జియాగ్రఫీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగరాజ్‌ ను బుధవారం మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే అరెస్టైన గెస్ట్‌ లెక్చరర్‌ సౌమ్య విచారణలో ఇచ్చిన సమాచారంతో నాగరాజ్‌ను అరెస్టుచేశారు. 

(చదవండి: ఎస్‌ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్‌ ద్వారా పరీక్ష రాసిన వైనం)

మరిన్ని వార్తలు