యువకుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్‌

1 May, 2022 12:35 IST|Sakshi

హుకుంపేట: యువకుడిపై సర్పంచ్‌ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, దాడికి పాల్పడడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాకూరు పంచాయతీ కేంద్రంలో బుధవారం సాయంత్రం శ్రీ పోతురాజుస్వామి జాతర మహోత్సవంలో భాగంగా డాన్స్‌బేబీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయంలోని స్టేజ్‌పై అదే గ్రామానికి చెందిన కాకర రవి ఎక్కి కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ సీనియర్‌ నాయకుడు, స్థానిక సర్పంచ్‌ వెంకటరమణరాజు, రవిని కొట్టడమే కాకుండా ముఖంపై కాలితో తన్నడంతో అతను గాయపడ్డాడు. దీనిపై సామాజిక మధ్యమాల్లో యువకుడిపై దాడి  ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.  

(చదవండి: వేడెక్కుతున్న మన్యం)

మరిన్ని వార్తలు