మియాపూర్‌లో దారుణం: చిన్నారి అనుమానాస్పద మృతి

13 Sep, 2021 10:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌లో దారుణం జరిగింది. 13 నెలల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. నిన్న ఓంకార్‌ నగర్‌లో చిన్నారి అదృశ్యం కాగా, ఈ రోజు తెల్లవారుజామున ఇంటి ముందు మృతదేహం లభ్యమైంది. తొలుత చిన్నారి మృతదేహాన్ని ఆమె అమ్మమ్మ చూసింది. ఇక నీటిలో ముంచి చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 13 ఏళ్ల బాలుడు ఎత్తికెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం 
భర్త ఫోన్‌కాల్‌: భార్యను చంపేశా.. కూతుర్లను కూడా చంపేస్తా..

మరిన్ని వార్తలు