వార్డెన్​ నిర్వాకం.. హస్టల్​ గదులను శుభ్రం చేయాలని బాలికకు వేధింపులు

20 Jan, 2022 20:57 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఒక హస్టల్​ వార్డెన్​ బాలికపట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. బాలికను హస్టల్​లోని గదులను శుభ్రంచేయాల్సిందిగా వేధించింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు బాలిక.. విషంతాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత జనవరి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. 17 ఏళ్ల బాలిక తంజావురు జిల్లాలోని మిఛేల్​పట్టి గ్రామంలోని ప్రభుత్వ హస్టల్​ ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో బాలికను హస్టల్​ వార్డెన్​ సగయమేరీ గదులను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతటితో ఆగకుండా బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించింది. దీంతో బాలిక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు  పాల్పడింది. బాలికను మెరుగైన వైద్యం కోసం తంజావురు ఆసుపత్రికి తరలించారు.

ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. కాగా, జనవరి 18న బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. వార్డెన్​ ప్రతిరోజు తరగతి గదులను శుభ్రం చేయాల్సిందిగా తనను వేధిస్తుండేదని తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హస్టల్​వార్డెన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలిక చికిత్స పొందుతు జనవరి 19న మృతి చెందింది. బాలిక మృతికి హస్టల్​ వార్డెన్​ వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హస్టల్​ వార్డెన్​పై  కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్​ ఏంటంటే

మరిన్ని వార్తలు