కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది

21 Jan, 2023 19:02 IST|Sakshi

చిన్న మాట పట్టింపు కాస్త చివరికి హత్యకు దారితీయడం బాధకరం. వారి మధ్య ఉన్న వివాదం పెద్దది కూడా కాదు. కేవలం తమ ఇగోతో ప్రస్టేజ్‌లకు పోయి చంపుకునేంత వరకు వెళ్లి చివరికి కటకటాల పాలవ్వు తున్నారు.  అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..తమిళనాడులోని ఉలగంపట్టియార్‌కొట్టంలె  నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డానియల్‌, విన్సెంట్‌తో కలిసి ఉంటోంది. వీళ్లకు ఓ పెంపుడు కుక్కడ ఉంది. అయితే వాళ్ల పొరుగింట్లో ఉండే రాయప్పన్‌(62).. దానిని పేరుతో కాకుండా కుక్క అని సంభోధిస్తూ వస్తున్నాడు. ఇది నచ్చక పలుమార్లు రాయప్పన్‌ హెచ్చరించారు ఫాతిమా కుటుంబ సభ్యులు. అయినప్పటికీ రాయప్పన్‌ అలానే పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో.. 

ఒక రోజు పొలంలోని నీళ్ల పంపు ఆపేయమని రామప్పన్‌ తన కొడుకు కెల్విన్‌కి చెప్పాడు. దీంతో అతను వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. ఆ పొలం పరిసరాల్లో కుక్కు ఉంటుందని అందువల్ల  కర్రను కూడా తీసుకుని వెళ్లమని చెబుతుండగా.. ఆ మాట విన్న డానియల్‌ కోపంతో నా పెంపుడు కుక్కను ‘కుక్క’ అంటావా అంటూ దూకుడుగా మీదకు వచ్చాడు.ఆ తర్వాత రాయప్పన్‌ ఛాతిపై బలంగా ఒక పంచ్‌ విసిరాడు. దీంతో అక్కడికక్కడే రామప్ప కుప్పకూలిపోయి చనిపోయాడు.

ఈ హఠాత్పరిణామనికి భయంతో డేనియల్‌ అతని కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులు తీవ్రంగా గాలించి.. నిర్మలా రాణి తోసహా ఆమె కుమారులను పట్టుకుని అరెస్టు చేశారు.

(చదవండి: ఎయిర్‌ ఇండియా మూత్ర విసర్జన ఘటన: వెలుగులోకి కీలక ఈమెయిల్స్‌)

మరిన్ని వార్తలు