హవాలా ముఠాను పట్టేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

8 Sep, 2020 12:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వావాలా లావాదేవీల ముఠాపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝుళిపించారు. స్విఫ్ట్‌ కారులో ఓ ముఠా హవాలా సొమ్ము తరలిస్తుందన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ బృందం ఆ ముఠాను కాపుకాసి పట్టేసింది. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు హవాలా సొమ్ము తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. ఆ కారులో ఉన్న కోటీ నలభై లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.24 లక్షలు విలువ చేసే 30వేల డాలర్లు పట్టుకున్నారు. బంగారం వ్యాపారి ప్రవీణ్ జైన్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా మూలాల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల వద్ద కూపీ లాగుతున్నారు.

మరిన్ని వార్తలు