రథాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం

29 May, 2022 02:23 IST|Sakshi

ముగ్గురు అక్కడికక్కడే మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం

నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శ్రీసీతారామచంద్ర స్వామి రథం తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథాన్ని ఆలయం నుంచి మరో చోటుకు తరలిస్తుండగా విద్యుత్‌ తీగలకు తగలడంతో షాక్‌ తగిలి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేతేపల్లి గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవాలు ఏప్రిల్‌ 10న ముగిశాయి.

అయితే రథం ఆలయ ఆవరణలోనే ఉండిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రథం తడుస్తుండడంతో దానిని తయారు చేయించిన దాత దయానందరెడ్డి రథాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు శనివా రం సాయంత్రం గ్రామానికి చెందిన పలువురిని గుట్టపైకి తీసుకెళ్లారు. అందులో 8 మంది తాళ్ల సహాయంతో..

మరో నలుగురు దానిని పట్టు కుని లాగుతుండగా ఇనుముతో చేసి న రథం కరెంటు తీగలకు తగలడంతో దానిని పట్టుకుని లాగుతున్న రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహనయ్య(36) దాసరి ఆంజనేయులు (26) విద్యు దాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. రాజబో యిన వెంకటయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
చదవండి: ‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’

మరిన్ని వార్తలు