మరణంలోనూ వీడని స్నేహబంధం

3 Apr, 2022 10:20 IST|Sakshi

చెట్టును బైక్‌ ఢీకొనడంతో ప్రమాదం

సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి

మర్రివలస కూడలి వద్ద ఘటన

కె.కోటపాడు (మాడుగుల) : మండలంలో మర్రివలస వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. దైవ కార్యక్రమానికి వచ్చిన వారిని బైక్‌ ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది. వీరిలో ఒకరు కె.కోటపాడు మండలం గొట్లాం గ్రామానికి చెందిన కొట్యాడ మణికంఠ (23)కాగా, మిగతా ఇద్దరు విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం దాసులపాలెంకు చెందిన కూనిశెట్టి త్రినా«థ్‌(20), జామి మండలం చింతాడకు చెందిన యర్రా సాయి(18) అని పోలీసులు తెలిపారు. 

స్నేహితుని ఆహ్వానం మేరకు.. 
కె.కోటపాడు మండలం గొట్లాం గ్రామంలో శుక్రవారం జరిగిన నూకాలమ్మ ఆలయ ప్రారంభ కార్యక్రమానికి గ్రామానికి చెందిన కొట్యాడ మణికంఠ ఆహ్వానం మేరకు స్నేహితులు కూనిశెట్టి త్రినాథ్, యర్రా సాయి వచ్చారు. వీరు ముగ్గురూ ఒకే బైక్‌పై పాతవలస గ్రామానికి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వారు ప్రమాదానికి గురయ్యారు. గొట్లాం గ్రామం వస్తుండగా మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి బైక్‌ అదుపుతప్పింది. రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. రోడ్డుపక్కన పడి ఉన్న మృతదేహాల్లో మణికంఠను స్థానికులు గుర్తించారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మణికంఠ సోదరుడు అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కె.కోటపాడు ఎస్‌ఐ జి.గోపాలరావు తెలిపారు. మణికంఠ బైక్‌ నడుపుతుండగానే ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు.  

గొట్లాంలో విషాదఛాయలు 
గొట్లాం గ్రామానికి చెందిన మృతుడు కొట్యాడ మణికంఠ తల్లిదండ్రులు రమణ, లక్ష్మమ్మలు వసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు మణికంఠ. మృతుడు విశాఖపట్నం పోర్ట్‌లో కంటైనర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు  రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో అందరినీ కంట తడి పెట్టించింది. పండగ రోజున గొట్లాం గ్రామంలో విషాదం చోటు చేసుకోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి.

విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం కూనిశెట్టి త్రినాద్‌ దాసులపాలెం గ్రామంలో ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తున్నాడు, జామి మండలం చింతాడకు చెందిన యర్రా సాయి విజయనగరంలోని ఓ కళాశాలలో డిప్లొమో చదువుతున్నాడని ఎస్‌ఐ తెలిపారు.  ముగ్గురు మృతదేçహాలకు చోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు