కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్‌!

31 Jul, 2022 07:08 IST|Sakshi

అరెస్ట్, రహస్యంగా పోలీసు విచారణ

వేలూరు: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఒక విద్యార్థి అరెస్ట్‌ కలకలం రేపింది. ఆంబూరు పట్టణానికి చెందిన అనార్‌ అలీ ఆర్కాడు దగ్గర్లోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజామున ఢిల్లీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు, వేలూరు ఇంటెలిజెన్స్‌ పోలీసుల సాయంతో అనార్‌ అలీ ఇంటిని చుట్టుముట్టారు. అతని వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థిని రహస్యంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇతర దేశాల్లోని కొందరితో నిందితుడికి పరిచయం ఉందని, వీరిలో కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్‌ అధికారులు విద్యార్థిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. అల్‌ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన నటుడు ఉసేన్‌ లస్కర్‌తో ఈ విద్యార్థి చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదీ చదవండి: రాడికల్‌ శక్తులను కట్టడి చేయండి

మరిన్ని వార్తలు