టీఆర్ఎస్ నేత వీరంగం: సీసీ టీవీలో దాడి దృశ్యాలు

14 Apr, 2021 10:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బేగంబజార్‌లో టీఆర్ఎస్ నేత శాంతిదేవి వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు షాప్‌లు మూసివేయాలని హంగామా చేశారు. ఫ్లై వుడ్ షాప్ మూసివేయాలంటూ షాప్ ఓనర్‌పై శాంతిదేవి దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన షాప్ ఓనర్‌పై శాంతిదేవి అనుచరులు దాడి చేశారు. శాంతిదేవి అనుచరుల దాడి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. దాడిపై షాపు ఓనర్‌... బేగం బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


చదవండి:


హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్‌

 

మరిన్ని వార్తలు