ఇప్పటికే రెండు సార్లు వివాహం.. శిక్షణ కోసం వచ్చిన యువతితో..

22 Sep, 2022 14:22 IST|Sakshi

తిరువళ్లూరు(చెన్నై): నీట్‌ శిక్షణ కోసం వచ్చిన 18 ఏళ్ల యువతికి ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు బైపాస్‌ రోడ్డులో నీట్‌ ఎడ్జ్‌ కోచింగ్‌  అకాడమి ఉంది. ఇక్కడ కాకలూరుకు చెందిన 18 ఏళ్ల యువతి ఆరు నెలలుగా కోచింగ్‌ తీసుకుంటోంది. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్‌గా కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామానికి చెందిన మూర్తి (32) పని చేస్తున్నాడు.

నాలుగు రోజుల క్రితం యువతి అదృశ్యమైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తిరుత్తణి వద్ద మూర్తి, యువతిని గుర్తించి విచారణ చేశారు. యువతికి ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. ఇప్పటికే మూర్తికి రెండు సార్లు వివాహాం సైతం జరిగినట్లు గుర్తించారు. దీంతో మూర్తిని రిమాండ్‌కు తరలించి యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

చదవండి: దారుణం.. ‘థ‍్యాంక్‌ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..!

మరిన్ని వార్తలు