గర్ల్‌ఫ్రెండ్ కోసం డబ్బులు కావాలని ఏటీఎం చోరికీ ప్లాన్‌.. బెడిసికొట్టి జైలుకెళ్లిన యువకుడు

30 Jul, 2022 20:05 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఏటీఎం నుంచి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం 2:15గంటల సమయంలో వీరు ఏటీఎంకు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో కన్నం వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి నిందితులు పారిపోయారని, గ్యాస్‌ కట్టర్‌, సిలిండర్ అక్కడే వదిలి వెళ్లారని వివరించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫూటేజీ పరిశీలించి ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

నిందితులను రాజస్థాన్ దౌసా జిల్లాకు చెందిన కమల్(27), ప్రవీణ్(20)గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏటీఎం చోరీకి సూత్రధారి తానే అని కమల్ విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు డబ్బు కావాలని, అందుకే తన కజిన్‌ ప్రవీణ్‌తో కలిసి చోరీకి పథకం పన్నినట్లు కమల్ చెప్పాడని తెలిపారు.
చదవండి: యూట్యూబ్‌లో చూసి వైన్‌ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో..

మరిన్ని వార్తలు