బంజారాహిల్స్‌: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో..

21 Jun, 2021 12:18 IST|Sakshi
సంతోష్‌, దివ్య   

సాక్షి, బంజారాహిల్స్‌: భర్త కొట్టాడని అలిగి ఓ భార్య ఇంట్లో చెప్పకుండా అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జి.శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌.10సి గాయత్రిహిల్స్‌లో నివసించే సీహెచ్‌ ప్రసాద్‌ కుక్‌గా పనిచేస్తున్నాడు. 2018లో దివ్య (21) అనే యువతిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

మూడేళ్ల పాటు వీరి సంసారం బాగానే సా గింది. గత ఏప్రిల్‌ 25వ తేదీన ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అదే నెల 30 వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. గత కొద్ది రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో గాలించినా భార్య ఆచూకీ తెలియకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య కోసం గాలింపు చేపట్టా రు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌: 7893044846 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

సాక్షి, బంజారాహిల్స్‌: భార్యతో ఏర్పడ్డ మనస్పర్ధలతో ఓ భర్త తీవ్ర మానసిక వేదనకు గురై మద్యానికి బానిసై ఇంట్లో చెప్పకుండా అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌.14లోని శ్రీవెంకటేశ్వనగర్‌లో నివసించే ఎం.సంతోష్‌కు జగద్గిరిగుట్టకు చెందిన రేణుకతో 10 నెలల క్రితం వివాహం జరిగింది.

కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో సంతోష్‌ డిప్రెషన్‌కు గురై తాగుడుకు బానిసయ్యాడు. ఈ నెల 13వ తేదీన అర్ధరాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయి తిరిగి రాలేదు. బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లేకపోవడంతో సోదరుడు హనుమంతు తన తమ్ముడు కనిపించడం లేదంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ కోసం గాలిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌: 7901104657 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. 

చదవండి: 
‘సిగ్గుందా?.. అల్లరి చేస్తే అత్యాచారంగా చూపిస్తారా?’
ఇన్‌స్టా పరిచయం.. యువతిని బయటకు రమ్మంటే రాలేదని..

మరిన్ని వార్తలు