న‌పుంస‌కుడివి అంటూ హేళన? మహిళా డాక్టర్ దారుణ హత్య..

21 Jul, 2021 17:11 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా డాక్టరును ఆమె బావ అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది.

వివరాలు.. వార‌ణాసిలోని మ‌హ‌మూర్‌గంజ్ ప్రాంతానికి చెందిన స్వప్న స్థానిక ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తుంది. మహమూర్‌గంజ్‌ ప్రాంతంలో బావతో కలిసి ఉ‍ంటుంది. ఈ క్రమంలో అనిల్‌ తనని న‌పుంస‌కుడంటూ నిత్యం వేధిస్తోందనే ఆగ్రహంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనిల్‌ను అరెస్ట్‌ చేశారు. 

మృతురాలు స్వప్న ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో స్వప్నను అనిల్ హ‌త్య చేశాడనే విషయం ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు.

మరోవైపు స‌ప్నపై తాను ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేయ‌డంతో తీవ్ర గాయాల‌పాలై మ‌ర‌ణించింద‌ని అనిల్ త‌న నేరాన్ని అంగీక‌రించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. తాను అనారోగ్యంతో ఉన్నా, తల్లిదండ్రులను చూసేందుకు వెళ‌తుండ‌గా త‌న‌ను చూసి పెద్దగా న‌వ్వుతూ న‌పుంస‌కుడంటూ ఎద్దేవా చేసిందని వీడియో క్లిప్‌లో నిందితుడు అనిల్ వాపోయాడు. గతంలో తన సోదరుడిని కూడా ఇలానే వేధించిందని చెప్పుకు రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు