శృంగారం పేరుతో వల.. నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి..

4 Jul, 2021 13:08 IST|Sakshi
గీతా పాటిల్‌

ముంబై : తానో అభాగ్యురాలినంటూ సీనియర్‌ సిటిజన్లకు దగ్గరై.. శృంగారం పేరుతో వారిని దోచుకుంటున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై మీరా రోడ్డులో నివాసం ఉంటున్న గీతా పాటిల్‌(40) ఖరీదైన కార్లలో తిరుగుతూ రోడ్డుపై ఒంటరిగా వెళ్లే సీనియర్‌ సిటిజన్లను ఆకర్షించేది. వాళ్లు ఆమె మాయలో పడగానే శృంగారానికి ప్రోత్సహించేది. ఇందుకోసం వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లేది. అక్కడ వాళ్లను భయపెట్టి విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యేది. గత వారం చార్‌కోప్‌కు చెందిన ఓ 70 ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. ఆయనకు సంబంధించిన బంగారు గొలుసు ఇతర విలువైన వస్తువులు దోచుకుంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదులో.. ‘‘ కొద్దిరోజుల క్రితం నేను బ్యాంకులో డబ్బు డిపాజిట్‌ చేసి, ఇంటికి నడుచుకుంటూ వెళుతున్నాను.

గీతా పాటిల్‌ నా దగ్గరకు వచ్చి ఏడ్వటం మొదలుపెట్టింది. ఎందుకని అడిగాను. తన భర్త టార్చర్‌ చేస్తున్నాడని చెప్పింది. నేను సానుభూతి వ్యక్తంచేశాను. సెక్స్‌ విషయంలోనూ భర్త ఆమెపై ఆసక్తి కనబర్చటం లేదని అంది. నన్ను తనతో ఏకాంతంగా గడపమంది. నేను, ఆమెకు కలిసి ఆటో రిక్షాలో ఊరి బయటి నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరకు వెళ్లాము. అక్కడ ఆమె నాపై దాడి చేసి, బంగారు చైను, నగదు దోచుకుంది. నేను ఎదురు తిరిగితే అత్యచారం చేస్తున్నావని అరుస్తాను అని భయపెట్టింది’’ అనిపేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెపై దాదాపు 14 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు