ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని..

3 Apr, 2021 08:30 IST|Sakshi

సాక్షి, కంటోన్మెంట్‌: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన నిందితుడిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాందీనగర్‌లో తల్లిదండ్రులతో నివాసముండే యువతి (25) గతంలో బోయిన్‌పల్లి దుబాయ్‌ గేటు సమీపంలో నివాసముండేది. ఆమె అక్క పిల్లలకు కటింగ్‌ చేయించేందుకు వెళ్లే క్రమంలో స్థానిక సెలూన్‌లో పనిచేసే సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన కనకరాజు (26)తో పరిచయం ఏర్పడింది.

గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు సొంతూరుకు వెళ్లిన కనకరాజు అదే ఏడాది జూన్‌లో తిరిగి బోయిన్‌పల్లికి వచ్చాడు. దీంతో కనకరాజును మళ్లీ కలుసుకున్న యువతికి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు లైంగికంగా లోబరుచుకున్నాడు. గత ఫిబ్రవరి 24న తిరిగి సొంతూరుకు వెళ్లిన కనకరాజు మరుసటి రోజు యువతి ఫోన్‌ చేయగా షెడ్యూల్‌ కులానికి చెందిన ఆమెతో కులాంతర వివాహానికి తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. తర్వాత బాధితురాలు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా కనకరాజు స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత నెల 16న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవలే కనకరాజును అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.  

చదవండి:కొవ్వును తగ్గిస్తానని చెప్పి.. గదిలోకి తీసుకెళ్లి ఆమెతో..

మరిన్ని వార్తలు