భర్తలో లోపం.. పిల్లలు పుట్టడం లేదని భార్యపై..

14 Jul, 2021 21:48 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో భర్త, మామ కలిసి ఓ మహిళకు నిప్పంటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. త్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో 32 ఏళ్ల మహిళను తన భర్త, నాన్నగారు నిప్పంటించారు.  పోలీసుల వివరాల ప్రకారం.. అశు కుష్వాతో రీమాకు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఇప్పటి వరకు వారికి పిల్లలు పుట్టలేదు. కాగా  ఆస్పత్రిలో చెక్‌ చేపించుకోగా.. అశు కుష్వా  స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందిని తేలింది. కానీ రీమా అత్తమామలు ఆమెలోనే లోపం ఉందని వేధించసాగారు. దీనిపై చాలాసార్లు గొడవ కూడా జరిగింది.

కాగా,  ఆదివారం సాయంత్రం రీమాపై ఆమె భర్త , మామ కొట్టి నిప్పంటించారు. ఈ ఘటనపై ఇరుగుపొరుగువారు  ఆమె కుటుంబ సభ్యులకు తెలిచేయడంతో..  రీమాను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆగ్రాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కాగా అశు కుష్వా కుటుంబం వరకట్నం కోసం చాలా ఒత్తిడి చేసినట్లు రీమా కుటుంబం ఆరోపించింది. రూ.4 లక్షలు వరకు రీమా అత్తమామలు  చెల్లించినట్లు పేర్కొంది. అయినప్పటికీ రీమాపై వేధింపులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన  భర్త, మామ, వదినపై ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
   

మరిన్ని వార్తలు